VKB: ప్రజా ప్రతినిధులు గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మోమిన్పేట్ మండలంలో బూరుగుపల్లి, ఆమ్రాధికలాన్ గ్రామాల్లో నిర్వహించిన ’99రోజుల ప్రజా పాలన’ గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.