ELR: శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ఆమోదించిన సందర్భంగా గురువారం రాత్రి ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద జై అమరావతి అంటూ ముగ్గులతో రాసి అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘జై అమరావతి -ఇది ఆంధ్రుల రాజధాని’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.