రాత్రిపూట చపాతీలకు బదులుగా జొన్న లేదా రాగి రొట్టెలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నల్లో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణం బాగా అవుతుంది. రాగి రొట్టె రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిని క్యారెట్, బీన్స్ కూరలతో తింటే పోషకాలు అందుతాయి. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతున్నారు.