KKD: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు దేశం మొత్తం అమరావతి వైపు నిలబడిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. అమరావతికి లభించిన చట్టబద్ధతకు సంకేతంగా గురువారం సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి ఎమ్మెల్యే సత్యప్రభ దీపహారతి ఇచ్చారు. ఆంధ్రుల ఐక్యతకు, ఆశయాలకు ఇది ఒక ప్రతీక అని ప్రతి ఇంటా వెలిగిన ఈ దీపం మన భవిష్యత్తుకు మార్గదర్శకం అన్నారు.