కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రంజిత్ రెడ్డి, అనీమియా బాధితురాలికి పదవసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ డా. బాలు ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రశంసించారు. కానిస్టేబుల్ రంజిత్ రెడ్డి, అనీమియా వ్యాధితో బాధపడుతున్న నసీమా బేగం అనే మహిళకు సకాలంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసినట్లు తెలిపారు.