MHBD: పెద్దవంగర మండలంలోని వడ్డేకొత్తపల్లి గ్రామంలో దుర్గమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.