JGL: వేసవిలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 3,52,072 రేషన్ కార్డులు ఉండగా 10,27,397 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 64,62,588 కిలోల బియ్యం ఇస్తుండగా, ఈసారి 3 నెలలకు 1,93,87,764 పిల్లల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.