MDK: రామాయం పేట మండలంలోని రాయలాపూర్ గ్రామంలో శ్రీ శక్తి భవన్ నిర్మాణానికి మంగళవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ఈ శక్తి భవన్ స్థానిక మహిళల సాధికారతకు, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలవనుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.