• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలి’

PDPL: ప్రజల భాగస్వామ్యంతో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఇవాళ ఆయన రామగిరి మండలం, కల్వచర్లలో జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. 99 రోజులలో చేపట్టే పనులపై గ్రామ సభలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని సూచించారు.

April 2, 2026 / 01:30 PM IST

నిర్మల్‌లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం

NRML: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని 36, 37 వార్డుల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

April 2, 2026 / 01:30 PM IST

విషాదం: ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యం

ASF: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్ పూర్ ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు మృతి చెందారు. బుధవారం నీటిలో గల్లంతైన అర్మాన్ మృతదేహం గురువారం లభ్యమైంది. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

April 2, 2026 / 01:30 PM IST

‘మహానీయుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలి’

MNCL: మహానీయుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని బెల్లంపల్లి పట్టణ దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ సంపత్‌ను కలిసి మహానీయుల జయంతి ఉత్సవాల గూర్చి చర్చించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాదిరి పట్టణంలో కూడ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు వహించాలని కోరగా, మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు.

April 2, 2026 / 01:30 PM IST

సర్వాయి పాపన్నకు ఘన నివాళులు

SRCL: సర్దార్ సర్వాయి పాపన్న అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ అన్నారు. సిరిసిల్ల ఐడీవోసీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోల్కొండ కోటపై జెండా ఎగరవేసి బహుజనులకు అధికారం కావాలన్నారు.

April 2, 2026 / 01:30 PM IST

‘పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలి’

KMM: లకారం ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని,సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు.

April 2, 2026 / 01:30 PM IST

ప్రజా పాలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

GDWL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలో వార్డు సభ నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. MLA మాట్లాడుతూ.. ప్రజల చెంతకే పాలనను చేర్చేందుకు గ్రామ, వార్డు సభలు ఏర్పాటు చేశామని తెలిపారు.

April 2, 2026 / 01:26 PM IST

‘వరంగల్ ఖిల్లాను గెలిచిన ధీరుడు పాపన్న గౌడ్’

MBNR: వరంగల్ ఖిల్లాను గెలిచిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 2, 2026 / 01:25 PM IST

ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం

RR: గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు తెలిపారు. షాద్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.

April 2, 2026 / 01:25 PM IST

జగ్గుచక్రతండాలో ముందస్తు బడిబాట కార్యక్రమం

NLG: దేవరకొండ మండలం జగ్గుచక్రతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవాస ప్రాంతంలో గురువారం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు పానుగంటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఉపాధ్యాయలు జానపాటి ఎల్లయ్య సర్పంచ్ జర్పుల జూలి బాలునాయక్, తదితరులున్నారు.

April 2, 2026 / 01:21 PM IST

గ్రామసభలో పాల్గొన్న కుడా ఛైర్మన్

WGL: గీసుగొండ మండలం కొనయమాకుల గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (KUDA) ఛైర్మన్ వెంకటరామిరెడ్డి సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్పంచ్ పీసల రాజు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. గ్రామస్థాయిలో ప్రతి సమస్యకు పరిష్కారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామసభ’లను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.

April 2, 2026 / 01:20 PM IST

పాండురంగాపురం తండాలో గ్రామసభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం తండా గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్లు హాజరై ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే భవిష్యత్తులో కూడా అభివృద్ధి పనులు ప్రజలకు చేరవేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

April 2, 2026 / 01:20 PM IST

జగద్గిరిగుట్టలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

MDCL: హనుమాన్ జయంతి సందర్భంగా జగద్గిరిగుట్టలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

April 2, 2026 / 01:20 PM IST

4.70 లక్షల విలువ గల గుట్కా పట్టివేత

హన్మకొండ నగరంలో టైలర్ స్ట్రీట్‌లోని శివం కిరాణా స్టోర్‌లో నిషేధిత గుట్కాలు నిల్వ చేశారని సమాచారం మేరకు గురువారం హన్మకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.4.70 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ,రాజ్‌పుత్ చేతన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

April 2, 2026 / 01:20 PM IST

ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి: ఎమ్మెల్యే

NZB: ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలని, నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని నిలబెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా సూచించారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం సారంగాపూర్, నీరుగొండ హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ పవిత్రమైన రోజు మనమందరం ఒక సంకల్పం చేయాలని, సమాజ సేవలో ముందుండాలన్నారు.

April 2, 2026 / 01:19 PM IST