BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో పాత గుట్ట రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మన కృషి అగ్రి డ్రోన్ సెంటర్”ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం రిబ్బన్ కట్ చేసి అగ్రి డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం చేకూరుతుందని తెలిపారు.
WNP: గోపాల్ పేట్ శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భారీ విరాళం ప్రకటించారు. రూ.2,50,000 విరాళం అందజేసి సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలతో పాటు కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
NRPT: అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసుకుంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు తెలిపారు. శనివారం హోటళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి 14 గృహ ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాటిని భద్రంగా ఉంచడానికి గురు కృప భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పగించామని అన్నారు.
వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రారంభమైనట్లు DEO రంగయ్య తెలిపారు. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరై 99.8 శాతం హాజరు నమోదైంది. 10 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని DEO పేర్కొన్నారు.
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని పలు హోటళ్లలో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 6 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వినియోగంపై పూర్తి స్థాయి 6A నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.
MNCL: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 9 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు.
NLG: మూసీ మురికి జలాలతో నల్గొండ ప్రజలు పడుతున్న నరకయాతనను ప్రతిపక్షాలు స్వయంగా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. హయత్‌నగర్‌లో రోడ్డు విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కలుషిత నీటి వల్ల ప్రజలు 35 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధుల్లా మారిపోతున్నారన్నారు. కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
MHBD: కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామ సర్పంచ్ దేవేందర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సర్పంచ్ సహకారంతో గ్రామంలోని ప్రధాన కూడళ్లలో రెండు సీసీ కెమెరాలను అమర్చారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, దొంగతనాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ సర్పంచ్‌ను అభినందించారు.
SRPT: జిల్లాలో శనివారం పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,355 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,342 మంది హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. అధికారులు 37 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తెలిపారు.
BHPL: జిల్లాలో శనివారం ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 99.75 శాతం విద్యార్థులు హాజరైనట్లు DEO రాజేందర్ తెలిపారు. జిల్లాలోని 20 సెంటర్లలో మొత్తం 3,544 మంది విద్యార్థులకు గాను 3,535 మంది పరీక్ష రాశారు. పరీక్షలు శాంతియుతంగా, జాగ్రత్తలతో నిర్వహించబడ్డాయని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు.
ADB: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. బజారహత్నూర్ మండలంలోని గోకొండ గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని MP నగేశ్ పేర్కొన్నారు.
ADB: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. బజారహత్నూర్ మండలంలోని గోకొండ గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని MP నగేశ్ పేర్కొన్నారు.
ములుగు జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. ఒకరి పేరుతో వచ్చిన సిలిండర్‌ను ఇతరులు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్ల వినియోగానికి సరిపడా సిలిండర్లు ఉన్నాయని, 45 రోజులకు ఒకసారి గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. కేవలం కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే కొంత కొరత ఉందన్నారు.
KNR: ఈరోజు నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు గంగాధర మండలంలో మొదటిరోజు 100 శాతం హాజరు నమోదైందని మండల విద్యాధికారి డా. ఏనుగు ప్రభాకర్ రావు తెలిపారు. మండలంలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 767 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి పరీక్ష తెలుగు ప్రశాంతంగా ముగిసిందని MEO పేర్కొన్నారు.