MNCL: చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోషా తీర్పునిచ్చారు. క్యాతన్ పల్లికి చెందిన అశోక్ కుమార్ లడ్డా వద్ద నేరెళ్ల రమేశ్ 2018లో రూ.5.77 లక్షలు, నేరెళ్ల సాయికృష్ణ రూ.4.83 లక్షలను అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో శిక్ష విధించారు.
NZB: యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ని ఎస్సై వంశీ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. శనివారం మోస్రా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, కార్యదర్శితో ఆయన సమావేశమయ్యారు. మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా కఠినంగా శిక్ష తప్పదని సూచించారు.
WNP: రేవల్లి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 193 మంది విద్యార్థులకు (132 బాలురు, 61 మంది బాలికలు) గాను అందరూ హాజరై పరీక్ష రాయడం విశేషం. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి లేకుండా తనిఖీలు చేసి విద్యార్థులను పరీక్షకు అనుమతించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
NLG: చింతపల్లిలో శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని అన్నారు. ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆకాక్షించారు.
NLG: చింతపల్లిలో శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శ్రీ గట్టు లక్ష్మి మైసమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని అన్నారు. ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆకాక్షించారు.
NZB: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరైనట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉపాధి హామీ పథకం (2025-26) వార్షిక ప్రణాళికలో భాగంగా శ్రీరాంపూర్, నాగపూర్, దేవాక్కపేట్ గ్రామాల్లో పలు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు.
SRCL వేములవాడ లో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అమరులకు సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత కడారి రాములు మాట్లాడుతూ.. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నిజాం నిరంకుశ పాలన వల్ల ఈ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి సీపీఐ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినొద్దీన్, రావి నారాయణరెడ్డి పిలుపుతో ప్రజలు పోరాటంలో చేరారన్నారు
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట పరీక్ష కేంద్రం సిబ్బంది ఉన్నారు.
వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. తొలిరోజు పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 7,208 మంది విద్యార్థులు హాజరు కాగా, 14 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగాయని ఆయన వెల్లడించారు.
BHPL: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
SRCL: కవి, రచయిత పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన “సాహితీ కళా సేవా పురస్కారం2026” కు ఎంపికయ్యారు. తెలుగు భాషతో పాటు సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో అన్ని భారతీయ భాషల్లో ఆయన చేస్తున్న అసాధారణ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఎంపిక చేసినట్లు సాహితీ కళా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న కిషోర్ తెలిపారు.
JN: జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సాదం రమేష్, అధ్యక్షుడిగా దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులుగా జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శిలుగా ఆవుల ప్రభాకర్, స్వరూపను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో ‘ప్రజాపాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలరాజ్, గ్రామ సర్పంచ్ సునీల్ పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
BHNG: మోత్కూర్‌లో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని తెలిపారు.
BHNG: మోత్కూర్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ల కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని వారు తెలిపారు.