MDK: శివంపేట్ మండలంలోని మక్దుంపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి, మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక వసతులతో గ్రామాలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కల్లూరి హరికృష్ణ పాల్గొన్నారు.