KRNL: ఆదోనిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకల సాక్షిగా కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఇంఛార్జ్ మల్లప్పకు ఎమ్మెల్యే తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. 18 వేల మెజారిటీతో గెలిపించిన తమ త్యాగాన్ని మరువొద్దని, గౌరవం ఇవ్వకుంటే జనసేన ద్వేషం ఎలా ఉంటుందో చూపిస్తామని ఆ పార్టీ నేత సాయి హెచ్చరించారు.