శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 23న జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, ప్రధాన కార్యదర్శి పిరికట్ల విటల్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు శనివారం సమావేశం నిర్వహించారు. సభ్యులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.