NDL: శ్రీశైలం మల్లన్న స్వామివారి స్పర్శ దర్శనం భక్తులకు ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని దేవస్థానం అధికారులు శనివారం తెలిపారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఉత్సవాలు ముగిసే వరకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని దేవస్థానం వెల్లడించింది.