• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నూతన విద్యుత్ లైన్ పనులను ప్రారంభించిన సర్పంచ్

MHBD: కురవి మండలం బలపాల గ్రామంలో నూతన విద్యుత్ లైన్ పనులను శనివారం గ్రామ సర్పంచ్ బిక్కు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నుంచి వైకుంఠధామం వరకు ఈ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రాత్రి వేళల్లో ఇబ్బంది కలగకుండా ప్రతి స్తంభానికి విద్యుత్ లైట్లను అమర్చుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఉన్నారు.

March 14, 2026 / 04:33 PM IST

ఈ నెల 18న పశువుల సంత వేలం

NGKL: ఈనెల 18న కల్వకుర్తి పశువుల సంత వేలం వేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు. పశువుల సంతతో పాటు తై బజార్, వధశాలకు వేలంపాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనే వారు డిపాజిట్ చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. పశువుల సంతకు రూ.10 లక్షలు, తై బజార్‌‌కు రెండు లక్షలు, వధశాలకు రూ.20,000 డిపాజిట్ చెల్లించాలని కోరారు.

March 14, 2026 / 04:33 PM IST

RGUKTలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

MBNR: మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీలో 2026 -27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇంఛార్జ్ వీసీ గోవర్దన్ వెల్లడించారు. 18వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమై, ఏప్రిల్ 10 వరకు కొనసాగుతాయన్నారు. కాగా, మే 20, 30 తేదీల్లో ఎంపిక జాబితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

March 14, 2026 / 04:33 PM IST

సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

JN: కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంటలకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందేలా చూడాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఏవో అంబికా సోనీ, ఎస్‌ఈలు సీతారాం, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:32 PM IST

ఈ నెల 16న ప్రజావాణి రద్దు: కలెక్టర్

GDWL: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు గద్వాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జనాభా గణన అంశంపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

March 14, 2026 / 04:30 PM IST

తాగునీటి పైప్‌లైన్‌లకు మరమ్మతులు

VKB: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిగి, 12వ వార్డు అయ్యప్ప కాలనీలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కౌన్సిలర్ వారాల రవీంద్ర ఆధ్వర్యంలో మంచినీటి పైప్‌లైన్‌లకు మరమ్మతులు చేయించారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా వార్డు మొత్తం పర్యవేక్షిస్తూ లీకేజీలను అరికడుతున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

March 14, 2026 / 04:30 PM IST

వేసవిలో కరెంటు కోతలు ఉండొద్దు: ఎమ్మెల్యే

RR: ఎండకాలంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. షాద్‌నగర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోకూడదని, తాగునీరు, సాగునీటికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.

March 14, 2026 / 04:29 PM IST

మచ్చ బొల్లారంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

MDCL: అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి, బొల్లారంలోని జామా మసీదులో అర్హులైన లబ్ధిదారులకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 04:28 PM IST

‘అవినీతి జరిగిందని ఆధారాలతో నిరూపించాలి’

MNCL: అధికార పార్టీపై బురదజల్లడం అలవాటుగా మారిందని MLA వినోద్ శనివారం ప్రకటనలో మండిపడ్డారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వారు, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు, PA లపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు.

March 14, 2026 / 04:27 PM IST

‘నాగయ్యపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తా’

HNK: ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన నాగయ్యపల్లి గ్రామ ఉప సర్పంచ్ కరుణాకర్, నేతలతో భేటీ అయ్యారు. గ్రామ అభివృద్ధి, ఇతర రాజకీయ అంశాలపై కాసేపు ఛైర్మన్‌తో వారు చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ తెలిపారు.

March 14, 2026 / 04:25 PM IST

మాజీ DGP పార్థివ దేహానికి నివాళులర్పించిన MLA

WGL: HYDలోని జూబ్లీహిల్స్ లో శనివారం మాజీ డీజీపీ HJ దొర అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో వర్ధన్నపేట MLA, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఆయన భౌతిక దేహానికి MLA పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ డీజీపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ప్రముఖులు ఉన్నారు.

March 14, 2026 / 04:23 PM IST

పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి: ఆడే గజేందర్

ADB: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం తాంసి మండలం కప్పర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులున్నారు.

March 14, 2026 / 04:23 PM IST

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

NRML: సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామ రైతు పరస్పర సహకార సంఘం సభ్యులు, తమ పంటలైన జొన్నలు, మొక్కజొన్నల కొనుగోలు కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే సంబంధిత అధికారులు అందరికీ వినతి పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు.

March 14, 2026 / 04:20 PM IST

విజ్ఞాన యాత్రకు సాయం అందజేత..!

NLG: చిట్యాల మండలం వట్టిమర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్రకు సామాజిక సేవకుడు నర్రా వేణు మోహన్ రెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా హెడ్‌మాస్టర్ జానకి మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఇలాంటి యాత్రలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ శ్రీలత శ్రీను విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 04:20 PM IST

సమాజ అభివృద్ధి కోసం మరింత సేవ చేయాలి: ఎమ్మెల్యే

NZB: సమాజ అభివృద్ధి కోసం ఆర్యవైశ్యులు మరింతగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శనివారం సుచిత్ర, కొంపల్లి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 04:20 PM IST