• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆన్‌లైన్ గేమింగ్‌కు యువకుడు బలి!

NZB: డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన బధావత్ అరుణ్ అనే యువకుడు శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో పాటు, ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో టవల్‌తో ఉరి వేసుకున్న అరుణ్‌ను గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

March 15, 2026 / 07:03 AM IST

ఆన్‌లైన్ గేమింగ్‌కు యువకుడు బలి

NZB: డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన బధావత్ అరుణ్ అనే యువకుడు శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో పాటు, ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో టవల్‌తో ఉరి వేసుకున్న అరుణ్‌ను గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

March 15, 2026 / 07:03 AM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం’

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్‌లో లబ్ధిదారురాలు అనసూయ, చంద్రయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఇచ్చిన కానుకను వారికి అందించారు.

March 15, 2026 / 07:03 AM IST

ఎండుతున్న వరి పొలాలు

BHNG: గుండాల మండలంలోని పలు గ్రామాల్లో పొట్టకొచ్చిన వరి చేలు నీరు లేక నెర్రెలుబారి ఎండిపోతున్నాయి. వరి పంట పాలు పోసుకునే దశలో నీరు అధికంగా అవసరం. బోర్లు, బావుల్లో నీరు లేకపోవడంతో రైతులు వరుస తడులపై పంటలకు నీరందిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరుస తడులకు నీరందక పంటలను పూర్తిగా గొర్రెల మేతకు వదిలేస్తున్నారు.

March 15, 2026 / 07:02 AM IST

SU డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు

KNR: SU పరిధిలో జరగనున్నBA, B.com, Bsc, BBA కోర్సుల్లో 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు పెంచినట్లు శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా మార్చి 18 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో మార్చి 24 వరకు చెల్లించుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

March 15, 2026 / 06:59 AM IST

‘రోడ్డు భద్రత, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి’

PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా మంథని పోలీసులు పిల్లల భద్రత, “మత్తు పదార్థాల వినియోగం–అనర్థాలు” సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. స్థానిక నృసింహ గార్డెన్‌లో మంథని పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి రామ్ రెడ్డి హాజరయ్యారు.

March 15, 2026 / 06:56 AM IST

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

WGL: వరంగల్ నగరంలో మరమ్మతు పనుల కారణంగా మూడు సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సబ్ స్టేషన్ ఏజే మిల్స్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ తెలిపారు. అలాగే మండిబజార్, కాశీబుగ్గ, చౌరస్తా, నూతన కలెక్టరేట్, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.

March 15, 2026 / 06:49 AM IST

మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్..!

SDPT: ఉమ్మడి మెదక్ జిల్లాలో మార్చి 15 నుంచి 17 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రైతులు తమ పంటలను కాపాడుకోవాలని, వర్షం సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

March 15, 2026 / 06:46 AM IST

ఇసుక అక్రమంగా తరలింపు.. కేసు నమోదు

NRPT: ఊట్కూర్ మండలంలోని త్రిప్రాస్‌పల్లి గ్రామానికి చెందిన మక్తల్ రాజు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చెకోపోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు చూపించాలని కోరగా డ్రైవర్ చూపించలేకపోవడంతో టిప్పర్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అనంతరం మక్తల్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 15, 2026 / 06:45 AM IST

మహిళా సర్పంచ్ల భర్తలు పెత్తనం చేయొద్దు: మంత్రి

WGL: మహిళా సర్పంచ్ల భర్తలు పెత్తనం చేయకూడదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మహిళా సర్పంచ్లు ప్రొటోకాల్ విస్మరించకుండా జాగ్రత్తగా ఉండాలని, జనరల్ బాడీ మీటింగ్‌లలో సమయం వృథా చేయకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, మహిళా సర్పంచ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

March 15, 2026 / 06:45 AM IST

VIDEO: కాలభైరవ స్వామిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

SRCL: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామివారిని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు శనివారం దర్శించుకున్నారు. కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 15, 2026 / 06:44 AM IST

రీజినల్ రింగ్ రైల్.. సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

HYD: నగరం చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు(RRR) వెంట రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం డీపీఆర్ తయారీకి అవసరమైన సర్వేకు అనుమతులు మంజూరు చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ వెల్లడించారు. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన వెలువడింది.

March 15, 2026 / 06:43 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక్కరు మృతి

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మల్లప్ప (70) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 06:43 AM IST

‘అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని MLA వినోద్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని బెల్లంపల్లి మండలం బాబుక్యాంప్ జామా మసీద్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

March 15, 2026 / 06:41 AM IST

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు శ్రీకారం

SRD: పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గంలో BJP పార్టీ బలోపేతానికి కసరత్తు ప్రారంభించామని BJP మండల అధ్యక్షుడు ఈర్ల రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కమిటీ కన్వీనర్ సముద్రాల రాకేష్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ నెల 21న శిక్షణ తరగతుల తుది రూపం తీర్చిదిద్దనున్నామని అన్నారు.

March 15, 2026 / 06:38 AM IST