• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్యాస్ కొరతతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు బంద్

SRPT: కోదాడ పట్టణంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో పట్టణంలో సగానికి పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఈరోజు మూతపడ్డాయి. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచి సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు.

March 15, 2026 / 12:51 PM IST

జంట కాలనీలలో ఆహ్లాదకరమైన పార్కుల ఏర్పాటు: ఎమ్మెల్యే

SRD: పటాన్‌ చెరువులో ‘ఎలైట్ అండ్ రిచ్’ కాలనీలుగా పేరొందిన శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలో ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం శాంతినగర్‌లో కొత్తగా పార్కు పనులను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి వయస్సు వారికి అనుకూలంగా ఉండే విధంగా పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

March 15, 2026 / 12:49 PM IST

నిరుపేదకు చికిత్స కోసమై రూ. 2 లక్షల LOC అందజేత

ASF: కాగజ్ నగర్ మండలం పర్దాన్ గూడకు చెందిన నైతం జ్యోతికకి మంజూరైన రూ. 2లక్షల CMRF చెక్కును MLA హరీష్ బాబు ఆదివారం అందజేశారు. జ్యోతిక ప్రఖ్యాత నిమ్స్ ఆసుపత్రిలో గుండెకు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. MLA మాట్లాడుతూ.. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు CMRF ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.

March 15, 2026 / 12:49 PM IST

ఫీజు పోరుకు తరలిన జిల్లా బీసీ నేతలు

NZB: ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో ఆదివారం HYDలో నిర్వహిస్తున్న ఫీజు పోరు దీక్షకు బీసీ సంక్షేమ సంఘం NZB జిల్లా నాయకులు తరలివెళ్లారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్‌మె ట్ బకాయిలను విడుదల చేసి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.

March 15, 2026 / 12:45 PM IST

ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాలలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయ భూమిపూజలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆలయాలు కేంద్ర బిందువులని, భక్తిభావంతో పనులు త్వరగా పూర్తికావాలని ఆయన ఆకాంక్షించారు.

March 15, 2026 / 12:44 PM IST

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు

MDK: తూప్రాన్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నాలుగో వార్డులో కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్‌తో కలిసి పర్యటించారు. వార్డులో జరుగుతున్న క్లీనింగ్ పనులను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిశీలించారు.

March 15, 2026 / 12:44 PM IST

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎదుట మహా దీక్ష ప్రారంభం

హనుమకొండ జిల్లా కాజిపేట మండలం అయోద్యపురం గ్రామంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎదుట ఆదివారం రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా దీక్షను చేపట్టారు. ప్రొ. కోదండరాం దీక్షలను ప్రాంభించారు. జేఎసీ కన్వీనర్ కొండ్ర నర్సింగరావు, కన్వీనర్ దేవులపల్లి రాఘవేంద్రరావుతో పాటు భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

March 15, 2026 / 12:44 PM IST

అభయాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ

SDPT: అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ అత్యంత భక్తిశ్రద్ధలతో, వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగాయి. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు అన్నదానం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సర్పంచ్ వాసాల తిరుపతి, హనుమాన్ దీక్షాపరులు, తదితరులు  పాల్గొన్నారు.

March 15, 2026 / 12:43 PM IST

నూతన సీఐని కలిసిన మున్సిపల్ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ ఆలీని శంకర్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అందరూ సహకారం అందించాలని సీఐ ఛైర్మన్‌ను కోరారు. కాంగ్రెస్ నాయకులు జూలకంటి పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.

March 15, 2026 / 12:42 PM IST

రైతు భరోసాపై ఆశలు వదులుకున్న రైతులు: మాజీ మంత్రి

WNP: రైతు భరోసాపై రైతులు ఆశలు వదులుకున్నారని, మూడు సీజన్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం వనపర్తిలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.9 వేల కోట్లు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం రైతులను వంచిస్తోందని, ప్రశ్నించే వారిని అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

March 15, 2026 / 12:42 PM IST

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లు పంపిణి

NLG: పవిత్ర రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో దాన ధర్మాలు నిర్వహించాలని మిత్ర బృందాన్ని అభ్యర్ధించినట్టు తెలిపారు. ముస్లిం సోదరసోదరీమణులు ఐక్యతగా మెలగాలని కోరారు. రంజాన్ పండుగను ఇంటిల్లిపాది భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అని అన్నారు.

March 15, 2026 / 12:41 PM IST

గ్రామపంచాయతీ కార్మికులకు బీమా బాండ్ల అందజేత

BHNG: ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు సర్పంచ్ నర్రముల రామలింగయ్య బీమా బాండ్లను అందజేశారు. ప్రమాదాలు లేదా అనుకోని పరిస్థితుల్లో కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బాండ్లు ఇచ్చినట్లు తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

March 15, 2026 / 12:40 PM IST

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

BDK: చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఖతీజా భర్త ఎస్‌డీ జాఫర్‌ను ప్రియుడి సహాయంతో హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి భర్త మరణించినట్లు భార్య అందరినీ నమ్మించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కూతురు నాన్నను అమ్మ, ఇంకో వ్యక్తి చంపారని బయటపెట్టడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి ఖతీజాను అరెస్టు చేశారు.

March 15, 2026 / 12:38 PM IST

‘చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలి’

MNCL: తాండూర్ మండలం బోయపల్లి గ్రామంలో మసాడి రామయ్య జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి-రమేష్ బాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. ఇలాంటి టోర్నమెంట్‌లు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికి తీస్తాయన్నారు.

March 15, 2026 / 12:37 PM IST

‘కార్మికుల సేవ మరువలేనిది’

SRCL: పారిశుద్ధ్య కార్మికుల సేవ మరువలేనిదని రామచంద్రపూర్ సర్పంచ్ గంధం శ్రీనివాస్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురంలోని గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను ప్రజా ప్రతినిధులు ఆదివారం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామానికి పారిశుద్ధ కార్మికులు ఎంతో సేవ చేస్తారన్నారు. కరోనా సమయంలో సైతం తమ సేవలు అందించారన్నారు.

March 15, 2026 / 12:32 PM IST