NZB: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో ఆదివారం HYDలో నిర్వహిస్తున్న ఫీజు పోరు దీక్షకు బీసీ సంక్షేమ సంఘం NZB జిల్లా నాయకులు తరలివెళ్లారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మె ట్ బకాయిలను విడుదల చేసి నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.