BDK: చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో ఖతీజా భర్త ఎస్డీ జాఫర్‌ను ప్రియుడి సహాయంతో హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి భర్త మరణించినట్లు భార్య అందరినీ నమ్మించింది. అంత్యక్రియల తర్వాత ఎనిమిదేళ్ల కూతురు నాన్నను అమ్మ, ఇంకో వ్యక్తి చంపారని బయటపెట్టడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి ఖతీజాను అరెస్టు చేశారు.