• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొండాపురంలో వార్డు కార్యాలయం ప్రారంభం

BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 9వ వార్డ్ కొండాపురంలో వార్డ్ కార్యాలయాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ప్రారంభించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేపట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ వెంకన్న, వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

March 15, 2026 / 01:30 PM IST

‘పంచాయతీ కార్మికుల సేవలు మరువలేనివి’

MNCL: లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వెంకటేష్, ఉప సర్పంచ్ మధుకర్‌ల ఆధ్వర్యంలో కార్యాలయం ఆవరణలో పంచాయతీ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. గ్రామాన్ని అందరూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

March 15, 2026 / 01:29 PM IST

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రాంచందర్ రావు

HYDలోని BJP రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి. అంబర్‌పేట్‌కు చెందిన పలువురు BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సమక్షంలో BJPలోకి చేరారు. వారికి పార్టీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మహానగరంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, స్వచ్ఛందంగా యువత, మహిళలు బీజేపీలో చేరుతున్నారన్నారు.

March 15, 2026 / 01:29 PM IST

కిడ్నీ బాధితులకు LOCలు అందజేసిన ఎమ్మెల్యే

NZB: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కిడ్నీ బాధితులకు MLA వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం LOCలను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స కోసం రూ.2.80 లక్షలు, కిడ్నీ డోనర్‌గా ఉన్న మహమ్మద్ ఖాజాకు వైద్య ఖర్చుల కోసం రూ.2.40 లక్షల విలువ గల LOCలను MLA తన నివాసంలో అందించారు.

March 15, 2026 / 01:25 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ

MDK: తెలంగాణ ప్రభుత్వ 99వ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామ పంచాయతీ వద్ద పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.

March 15, 2026 / 01:24 PM IST

‘మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యాదవులకే ఇవ్వాలి’

MBNR: మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని అఖిల భారత యాదవ మహాసభ రూరల్ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు యాదవ సమాజక వర్గం పూర్తిస్థాయిలో అండగా నిలబడ్డ సంగతి గుర్తుంచుకోవాలన్నారు. యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.

March 15, 2026 / 01:23 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం

GDWL: మన గ్రామం పచ్చగా, పరిశుభ్రంగా ఉందంటే అది పారిశుద్ధ్య కార్మికుల నిరంతర శ్రమ ఫలితమే అని చాగదోణ గ్రామ నాయకులు కొనియాడారు. ప్రభుత్వ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం చాగదోణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని కాపాడటంలో అహర్నిశలు శ్రమించారన్నారు.

March 15, 2026 / 01:23 PM IST

శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

JGL: కథలాపూర్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామిని ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల లక్ష్మి, ఉప సర్పంచ్ శేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 15, 2026 / 01:21 PM IST

ప్రేమించిన యువతికి HIV రక్తం.. కారణం ఇదే!

MDCL: పోచారంలో ప్రేమించిన యువతికి HIV పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన కేసులో నిందితుడు మనోహర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను ప్రేమించిన మరదలకి AIDS వస్తే, తనకే ఇచ్చి పెళ్లి చేస్తారనే ఉద్దేశ్యంతో ఆమెకు HIV రక్తాన్ని ఎక్కించినట్లు మనోహర్ తెలిపాడు. యువతి తండ్రి మనోహర్‌‌కి కూడా HIV అని తేలడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.

March 15, 2026 / 01:20 PM IST

వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

NGKL: రాష్ట్రంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వడ్డెర సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. వడ్డెరల ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలని సంఘం అధ్యక్షుడు మద్దిలేటి కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జగదీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.

March 15, 2026 / 01:17 PM IST

‘డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయాలి’

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కమిషనర్ శ్యాంసుందర్‌తో కలిసి ఇవాళ పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడిక, నీటి నిలుపుదలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 15, 2026 / 01:17 PM IST

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

SDPT: బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. సూపర్‌వైజర్ సులోచన, స్టాఫ్ నర్స్ లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ గోపాల్ ఉన్నారు.

March 15, 2026 / 01:16 PM IST

మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

SRD: నాగల్‌గిద్ద మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనం, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు మహిళా సమైక్య భవనాలు కీలకమని పేర్కొన్నారు. ఈ భవనం ద్వారా మహిళల శిక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, శ్రీకాంత్, సంజు పటేల్,గుండె రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

March 15, 2026 / 01:16 PM IST

జీడికే 11 ఇంక్లైన్ గనిలో మహిళా దినోత్సవం

PDPL: సింగరేణి RG–1 జీడీకే–11 ఇంక్లైన్ గనిలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గని ఏజెంట్ చిల్క శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా నారీశక్తి అవార్డు పొందిన అల్లం నవ్యశ్రీని అభినందించారు. ఈ విజయం మహిళా ఉద్యోగులందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. మహిళా ఉద్యోగులు కంపెనీ లక్ష్యాల సాధనలో ముందుండాలని సూచించారు.

March 15, 2026 / 01:15 PM IST

రైతులకు కూరగాయల కిట్‌ల పంపిణీ

ADB: హార్టికల్చర్ శాఖ ద్వారా రూ. 500 విలువచేసే కూరగాయల విత్తనాల కిట్‌లను ఈరోజు బోథ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో 100% సబ్సిడీతో రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. కూరగాయలు పండించే రైతులు మాత్రమే ఈ కూరగాయల కిట్లకు అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, ఏఈఓ ఆడెపు కృష్ణ పలువురు రైతులు పాల్గొన్నారు.

March 15, 2026 / 01:14 PM IST