HYDలోని BJP రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి. అంబర్‌పేట్‌కు చెందిన పలువురు BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సమక్షంలో BJPలోకి చేరారు. వారికి పార్టీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మహానగరంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, స్వచ్ఛందంగా యువత, మహిళలు బీజేపీలో చేరుతున్నారన్నారు.