అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులు అర్చకం ప్రసాద్ శర్మ, జగన్నాథమయ్య, పద్మనాభ భట్టార్, లక్ష్మణాచార్యులను కలెక్టర్ ఆనంద్ ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ. 10,116 నగదు పురస్కారాన్ని అందజేశారు.