• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈనెల 16న అండర్-19 బాక్సింగ్ ఎంపిక పోటీలు

NRML: ఈనెల 16న నిర్మల్లో అండర్-19 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా బాక్సింగ్ సెక్రటరీ చందుల స్వామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 1 జనవరి 2008 నుంచి 31 డిసెంబర్ 2009 మధ్యలో జన్మించినవారు ఆధార్ కార్డు, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. పోటీల్లో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

March 15, 2026 / 02:19 PM IST

ఢిల్లీకి బయలుదేరిన BHPL జిల్లా యూత్ నాయకులు

BHPL: BJP కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు  జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాణి మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, MLA గండ్ర ఆదేశాల మేరకు ఢిల్లీకి బయలుదేరినట్లు ఆయన తెలిపారు.

March 15, 2026 / 02:16 PM IST

అంత్యక్రియల ఖర్చులకోసం ఆర్థిక సహాయం

NLG: చిట్యాల పురపాలికలోని 10వ వార్డుకు చెందిన దాసరి పద్మ క్యాన్సర్‌తో మృతి చెందారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత-రమేష్ మానవత్వం చాటుకున్నారు. నిరుపేద కుటుంబ పరిస్థితిని గమనించి, అంత్యక్రియల నిమిత్తం ఆదివారం రూ. 5,000లు తక్షణ సహాయాన్ని అందించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె వెంట కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.

March 15, 2026 / 02:15 PM IST

హుజూర్ నగర్ టూ శ్రీలంక.. క్రికెట్ బరిలో భరత్ రెడ్డి

SRPT: పట్టుదలతో శ్రమించిన హుజూర్ నగర్ యువకుడు బొబ్బ భరత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. శ్రీలంకలో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపికైన భరత్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. బౌలర్‌గా రాణిస్తూ 100కు పైగా వికెట్లు తీసిన భరత్, భవిష్యత్తులో ఐపీఎల్, భారత జట్టులో చోటే లక్ష్యమని చాటిచెప్పాడు. జిల్లా వాసులు భరత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

March 15, 2026 / 02:15 PM IST

గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానం

ADB: భోరాజ్ మండలం బాలాపూర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అచ్యుత్ కార్మికులను శాలువాలతో సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు (MPW) కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు.

March 15, 2026 / 02:14 PM IST

10వ వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ క్లీనింగ్

BHNG: 10వ వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నీరు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుందని స్థానికులు పదో వార్డు కౌన్సిలర్ నల్ల మధుకి సమాచారం అందించారు. ఈ మేరకు తక్షణమే స్పందించి తన సొంత ఖర్చులతో జేసీబీ తీసుకువచ్చి, డ్రైనేజీ సమస్యను దగ్గర ఉండి క్లీన్ చేయించి, డ్రైనేజీ నీరును చెరువులోకి వెళ్లే విధంగా చేశామని కౌన్సిలర్ తెలిపారు.

March 15, 2026 / 02:10 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన తిరుపతి రెడ్డి

WGL: నల్లబెల్లి (M) లోని రంగాపురం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులు పెద్దోజు రామ, రమణాచారి నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొన్ని నూతన ఇంటిని ప్రారంభించారు. ప్రజా పాలనలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.

March 15, 2026 / 02:10 PM IST

ఎల్లమ్మ సిద్దోగానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

 SRCL: ఈనెల 17, 18న తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో జరిగే ఎల్లమ్మ సిద్దోగానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గౌడ సంఘం నాయకులు ఆదివారం ఆహ్వానించారు. ఎల్లమ్మ సిద్దోగానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. భక్తులు పెద్ద ఎత్తున సిద్ధోగానికి హాజరు కావాలన్నారు.

March 15, 2026 / 02:05 PM IST

2వ వార్డులో నూతన పోల్స్ బిగింపు

KMR: ఎల్లారెడ్డి 2వ వార్డు ప్రియా థియేటర్ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను విద్యుత్ సిబ్బంది తొలగించి, నూతన పోల్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదంగా మారడంతో స్థానికులు కౌన్సిలర్ మహేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె అధికారులతో మాట్లాడి కొత్త స్తంభాలు వేయించారు.

March 15, 2026 / 02:04 PM IST

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: MLA

MHBD: పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస దంత వైద్యశాల&మెడికల్ స్టోర్‌ను MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్, పట్టణ అధ్యక్షులు గణపురపు అంజయ్య, వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు.

March 15, 2026 / 02:03 PM IST

‘3వ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి’

NZB: నగర పాలక సంస్థ పరిధిలోని మూడో డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కార్పొరేటర్ చింతా ప్రసూన హామీ ఇచ్చారు. ఆదివారం గంగస్థాన్ ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను సత్కరించారు. డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శ్యామ్, కోశాధికారి వంజరి రమేష్ పాల్గొన్నారు.

March 15, 2026 / 02:02 PM IST

‘ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’

JGL: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ శ్యామ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 15, 2026 / 01:55 PM IST

చేవెళ్ల మున్సిపాలిటీలో చెత్తను ఎత్తిన ఎమ్మెల్యే

RR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీ 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని రోడ్లను శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

March 15, 2026 / 01:33 PM IST

జీపీలో ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సన్మానం

KNR: రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బందికి సన్మానం చేశారు. సర్పంచ్ వెన్నం మల్లేష్, పంచాయతీ కార్యదర్శి దురిశెట్టి నరసయ్య ఆధ్వర్యంలో వారిని సత్కరించి నిత్యవసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు.

March 15, 2026 / 01:32 PM IST

‘స్వయం ఉపాధికి దరఖాస్తులు ఆహ్వానం’

PDPL: జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులు కోరుకున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. రవాణా రంగంలో ఎలక్ట్రికల్ వెహికల్ టూవీలర్, త్రీ వీలర్, వ్యవసాయ అనుబంధ రంగాలలో సబ్సిడీపై యూనిట్లు కేటాయిస్తామన్నారు. అర్హులైన వారు ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 15, 2026 / 01:30 PM IST