PDPL: జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు దరఖాస్తులు కోరుకున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. రవాణా రంగంలో ఎలక్ట్రికల్ వెహికల్ టూవీలర్, త్రీ వీలర్, వ్యవసాయ అనుబంధ రంగాలలో సబ్సిడీపై యూనిట్లు కేటాయిస్తామన్నారు. అర్హులైన వారు ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.