• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

NLG: వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 07:25 PM IST

వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

RR: ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. స్వామి కళ్యాణ మహోత్సవంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

March 15, 2026 / 07:20 PM IST

జనగణన శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్

KMM: ఖమ్మం కలెక్టరేట్లో ఆదివారం జనగణన-2027కు సంబంధించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొదటి దశ ఇళ్ల జాబితా మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో దశ జనగణన ఫిబ్రవరి 2027లో జరుగుతుందని తెలిపారు.

March 15, 2026 / 07:18 PM IST

రంజాన్ ఈద్.. ముస్లిం పేదలకు తోఫాల పంపిణీ

NZB: నందిపేట్‌లోని మస్జిద్ మౌజా వద్ద రంజాన్ ఈద్ పురస్కరించుకొని నందిపేట్ ఎన్టీఆర్ కాలనీ, బజార్ కొత్తూర్ గ్రామాల పేద ముస్లిం కుటుంబాలకు తోఫాల పంపిణీని చేపట్టారు. బజార్ కొత్తూర్ సర్పంచ్ గోపుముత్యం, నందిపేట్ వార్డు సభ్యుడు పాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ జమీల్ పాల్గొని లబ్ధిదారులకు తోఫాలను అందజేశారు.

March 15, 2026 / 07:16 PM IST

ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని MLAకు వినతి

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తల గురించి పొందుపరిచిన రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతిపత్రం అందజేశారు. మార్చి 16 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించి ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

March 15, 2026 / 07:15 PM IST

ఎన్నికల హామీలు అమలు చేయాలి: హరీశ్ రావు

HYD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు.  స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 15, 2026 / 07:07 PM IST

‘ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు దృష్టి సారించాలి’

KNR: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. కరీంనగర్‌కు విచ్చేసిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, స్వాగతం పలికారు.

March 15, 2026 / 07:07 PM IST

‘బహుజన సమాజం కోసం ఏకం కావాలి’

ADB: బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లాధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాన్యశ్రీ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎస్పీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

March 15, 2026 / 07:06 PM IST

తొలిదశ జనగణనపై కలెక్టరేట్‌లో శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలో మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న తొలిదశ జనగణనపై కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ఛార్జ్ లెవల్ ఇంఛార్జులకు దిశానిర్దేశం చేశారు. ఎన్యూమరేటర్‌లు, సూపర్ వైజర్ల నియామక ప్రక్రియపై సూచనలు చేశారు. 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 15, 2026 / 07:04 PM IST

బాధిత కుటుంబాన్ని ప్రమర్శించిన MLA దొంతి

WGL: నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన సంకటి భాస్కర్, ప్రసాద్ తండ్రి సంకటి మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA దొంతి మాధవరెడ్డి ఆదివారం మృతుడు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

March 15, 2026 / 07:02 PM IST

నేటి బాలలే రేపటి పౌరులు: కౌన్సిలర్

KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చిన్నారుల చేత ఓనమాలు దిద్దించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. నేటి బాలలే రేపటి పౌరులని కౌన్సిలర్ తెలిపారు.

March 15, 2026 / 07:02 PM IST

‘ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది’

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారన్నారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అండగా నిలిచాడన్నారు.

March 15, 2026 / 07:01 PM IST

‘జన గణన- 2027 పకడ్బందీగా నిర్వహించాలి’

WNP: దేశంలో దాదాపు 15 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న జన గణన-2027 అత్యంత ముఖ్యమైనదని, దీని ఆధారంగానే దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని, అందువల్ల ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణకు ఆయన హాజరై జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

March 15, 2026 / 07:00 PM IST

రామగుండం చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

PDPL: రామగుండం మున్సిపల్ చౌరస్తా సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న యాష్ లారీ టూ వీలర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి, ట్రాఫిక్ ఎస్సై హరి శేఖర్ సహాయంతో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 15, 2026 / 06:50 PM IST

జాతీయ సేవారత్న అవార్డు అందుకున్న మాజీ సర్పంచ్

RR: బహుజన సాహిత్య అకాడమీ 18వ ఆల్ ఇండియా రైటర్స్ వేదిక సమావేశంలో చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్లోళ్ల హనుమంత్ రెడ్డి జాతీయ సేవారత్న అవార్డును అందుకున్నారు. తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డు అందుకున్నట్లు వారు పేర్కొన్నారు.

March 15, 2026 / 06:49 PM IST