• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటది’

NLG: మల్లేపల్లి-చింతపల్లి మార్గంలో ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందడం బాధాకరం. దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 మంది క్షతగాత్రులను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

March 15, 2026 / 06:12 PM IST

‘గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’

ADB: తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో MP గోడం నగేశ్ ఆదివారం పర్యటించారు. పీఎం జన్మనిధుల నుంచి రూ. 101 లక్షల నిధులతో మంజూరు అయిన బీటీ రోడ్డుకు MP గోడం నగేశ్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MP నగేశ్ పేర్కొన్నారు. నాయకులు గంగాధర్ రావు, చంద్రకాంత్, వెంకట స్వామి, భీంరావ్, సంతోష్, నారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 06:05 PM IST

ఒకే కుటుంబంలో ముగ్గురు చార్టెడ్ అకౌంటెంట్

KMR: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్ ఇద్దరు కొడుకులు, కోడలు చార్టెడ్ అకౌంటెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఆదివారం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద కుమారుడు రమేష్ భార్య ప్రియా కూడా చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తున్నారు. దీంతో ఆ గ్రామస్థులు కూడా వారిని అభినందిస్తున్నారు.

March 15, 2026 / 06:04 PM IST

GP సిబ్బంది సేవలు అమూల్యం: సర్పంచ్

BHPL: రేగొండ మండలం పోచంపల్లి గ్రామపంచాయతీలో GP కార్యదర్శి జ్యోతి, GP సిబ్బందిని ఆదివారం సర్పంచ్ కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో వీరి సేవలు అమూల్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 06:04 PM IST

GP సిబ్బంది సేవలు అమూల్యం: సర్పంచ్

BHPL: రేగొండ మండలం పోచంపల్లి గ్రామపంచాయతీలో GP కార్యదర్శి జ్యోతి, GP సిబ్బందిని ఆదివారం సర్పంచ్ కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో వీరి సేవలు అమూల్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 06:04 PM IST

జనాభా గణన సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

BDK: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన–2027 కార్యక్రమాన్ని జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా, గృహ వసతుల గణనపై జిల్లా ఇన్‌ఛార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

March 15, 2026 / 06:03 PM IST

ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు

VKB: కొడంగల్ మండల పలుగు రాళ్ల తండాలో సర్పంచ్ మోతిలాల్ నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సెక్రెటరీలను సన్మానించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

March 15, 2026 / 06:03 PM IST

రైల్వే పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య

KNR: జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు దూసుకెళ్లి తల, శరీరం వేర్వేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 06:02 PM IST

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: గోపాల్ నాయక్

WGL: గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పని చేస్తున్నదని చెన్నారావుపేట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ అన్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి సహకారంతో అక్కల్చెడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి NREGS నిధులు మంజూరయ్యాయన్నారు. స్థానిక సర్పంచ్ బుజ్జి సురేష్‌తో కలిసి గోపాల్ నాయక్ కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు.

March 15, 2026 / 06:02 PM IST

నూతన ఫుడ్ కోర్ట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాందాస్

KMM: సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్‌ను స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర హిమ్లా, అజ్మీర కిషోర్ నాయక్, అజ్మీర నరేన్, అజ్మీర రవి తదితరులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

March 15, 2026 / 06:01 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

MDK: రాంపూర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్, అల్లుడు సాయ గౌడ్ మరణించారు. ఆదివారం వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పద్మదేవేందర్ రెడ్డి గారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

March 15, 2026 / 05:49 PM IST

ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ‘వేముల’

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి, గ్రామీణుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించి శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

March 15, 2026 / 05:48 PM IST

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

WNP: గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దమాడూరు గ్రామంలో రూ.21 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులు దశాలవారీగా పూర్తి చేస్తామన్నారు.

March 15, 2026 / 05:45 PM IST

గ్యాస్ కొరతపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

RR: శంకర్‌పల్లి చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ కొరతపై బీజేపీ కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా శంకర్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొండకళ్ల నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సంజయ్, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహిపాల్ పాల్గొన్నారు.

March 15, 2026 / 05:44 PM IST

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా

SRD: తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునిసిపల్ కమిషనర్‌తో కలిసి వార్డ్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ పర్యటించారు. కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అందరూ బహిరంగ ప్రదేశానికి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

March 15, 2026 / 05:38 PM IST