NZB: నగర పాలక సంస్థ పరిధిలోని మూడో డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కార్పొరేటర్ చింతా ప్రసూన హామీ ఇచ్చారు. ఆదివారం గంగస్థాన్ ఫేజ్-2 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను సత్కరించారు. డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శ్యామ్, కోశాధికారి వంజరి రమేష్ పాల్గొన్నారు.