SRPT: పట్టుదలతో శ్రమించిన హుజూర్ నగర్ యువకుడు బొబ్బ భరత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. శ్రీలంకలో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపికైన భరత్‌ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. బౌలర్‌గా రాణిస్తూ 100కు పైగా వికెట్లు తీసిన భరత్, భవిష్యత్తులో ఐపీఎల్, భారత జట్టులో చోటే లక్ష్యమని చాటిచెప్పాడు. జిల్లా వాసులు భరత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.