శ్రీకాకుళం మండలం సింగుపురంలో ఆహారం వికటించడం (ఫుడ్ పాయిజనింగ్) వల్ల పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తమయ్యారు. ఈ విషయం పై ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో శుక్రవారం రాత్రి ఫోన్లో మాట్లాడి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.