VZM: స్థానిక 42వ డివిజన్ అయ్యన్నపేట జంక్షన్ వద్ద మున్సిపల్ నడక మైదానానికి గొప్ప దాత, విద్యాదాత పీవీజీ.రాజు పేరు పెట్టాలని ప్రముఖ సామాజికవేత్త త్యాడా రామకృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం MLA అతిది గజపతిరాజును కలసి వినతిపత్రం అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. పిల్లలకు క్రీడా పరికరాలు, యువతీ యువకులకు బహిరంగ వ్యాయామశాలా పరికరాలు ఎర్పాటు చేయాలని కోరామన్నారు.