‘బైకర్’ సక్సెస్ మీట్లో నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూవీ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, హీరోగానే కాకుండా నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేశాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘గోటీల ఫ్యాక్టరీ’ వార్తలపై స్పందిస్తూ.. ‘సినిమాలో బైక్ ఫ్యాక్టరీ ఓనర్ని అయినా, నా గోటీల ఫ్యాక్టరీని మాత్రం వదలను’ అంటూ సరదాగా నవ్వులు పూయించాడు.