మేడ్చల్ జిల్లా శివారు ప్రాంతాలైన కీసర, శామీర్పేట మరెన్నో ప్రాంతాల్లో గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండేది. వేసవికాలంలో కొద్దో గొప్ప ఆసరా అయ్యేది. కానీ ప్రస్తుతం మొత్తం అర్బన్ ఏరియాగా మారటం, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చెందడంతో ఇక్కడ పథకం కనుమరుగయింది. దీంతో ORR చుట్టూర నిరుపేద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.