SRD: నాగల్గిద్ద మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనం, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు మహిళా సమైక్య భవనాలు కీలకమని పేర్కొన్నారు. ఈ భవనం ద్వారా మహిళల శిక్షణ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, శ్రీకాంత్, సంజు పటేల్,గుండె రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.