HNK: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఇంటర్, 64 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్‌లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్‌లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
MDK: మనస్పర్థలతో యువకుడు ఆత్మహత్య చేసుకన్న చిలిపిచెడ్ మండలం చిట్కుల్‌లో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ (30) సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌కు ఇల్లరికం వెళ్లాడు. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా మనస్తాపం చెంది పొలానికి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో చిట్కుల్‌లోని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
WGL: ఉమ్మడి జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రంజాన్ నెల అత్యంత పవిత్రమైనదని మంత్రి పేర్కొన్నారు. ఈ మాసంలో ముస్లిం ప్రజలందరూ ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో, ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని మంత్రి సురేఖ కోరారు.
MBNR: గత నెల 25న ఉండవెల్లి మండలం కంచుపాడులో జరిగిన ఈడిగ కృష్ణ గౌడ్ హత్య కేసును అలంపూర్ పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు సీఐ వి.ప్రదీప్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కల్లు వ్యాపారం, స్థల వివాదంలో కృష్ణ గౌడ్ తనను ఊరిలో ఉండనివ్వడం లేదని పగతో శ్రీనివాస్ గౌడ్ తన స్నేహితుడు రాజు, నబీతో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.
SDPT: పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే రంజాన్ ఉపవాస దీక్ష, ఆత్మపరిశీలన, దానం, దయ, సహనానికి ప్రతీక అని ఈ పవిత్ర మాసంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రతి ఇంటిపైనా ఉండాలని ఆయన కోరారు.
NLG: చిట్యాల మండలంలోని రైతులందరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు వెంటనే ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ లో పేరు నమోదు చేసుకోవాలని ఏవో గిరిబాబు సూచించారు. ప్రభుత్వ సబ్సిడీలు, బీమా, మద్దతు ధర, పీఎం కిసాన్ వంటి ప్రయోజనాలు నేరుగా పొందేందుకు ఈ నమోదు తప్పనిసరి. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ లింక్ ఐన మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రీ కావాలని అన్నారు.
NZB: TU పరిధిలో ఉమ్మడి జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలలో జరిగిన మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి అని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిన్న జరిగిన పరీక్షలకు 617 మంది విద్యార్థులకు గాను 585 మంది విద్యార్థులు హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యా రని పేర్కొన్నారు.
JGL: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో రాయికల్ మండలం అల్లీపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అథ్లెటిక్స్ పోటీలలో టీ. అనూష,శేషి ప్రియ, నితీషా, బాస్కెట్ బాల్ పోటీలకు ఎన్. షర్మిల ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, పీడీ క్రిష్ణ ప్రసాద్‌లు తెలిపారు.ఈ నెల 20-22 వరకు హనుమకొండ, నిజామాబాద్‌లో జరిగే అథ్లెటిక్స్ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.
SDPT: హైదరాబాద్ దోమలగూడలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యంగుల క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 11 బహుమతులు గెలుచుకున్నారు. అండర్-14, 17 విభాగాల్లో వినికిడి, దృష్టి లోపం, ఇతర దివ్యాంగ విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యంతో జిల్లా కీర్తిని చాటారు.
PDPL: పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన వర్షిత్ రెడ్డి సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా రు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు పెద్దపల్లి జిల్లా మొత్తం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి వర్షిత్ రెడ్డి కావడం విశేషమని గ్రామస్తులు తెలిపారు.
PDPL: ధర్మారం అయ్యప్ప గుడి సమీపంలో బుధవారం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు డివైడర్‌ను ఢీకొని గాయాల పాలయ్యారు. మద్దెల సాగర్ (20) తలకు, కుడి చేతికి గాయాలు కాగా, మేకల వంశీ (20) కుడి కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది సతీష్, శ్రీనివాస్ బాధితులకు ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
JGL: నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, పాఠశాల ఏర్పాటు గురించి, కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
PDPL: NHM జేఏసీ పిలుపుతో “ప్రజాప్రతినిధుల ములాఖాత్” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావును జేఏసీ ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్‌తోపాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా రెగ్యులరైజేషన్ చేపట్టేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు పి. వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం ఆర్జీ-1 ఏరియాలోని బొగ్గు గనులను సందర్శించారు. వీరికి జి.యం లలిత్ కుమార్ గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని వివరించారు. సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.