MNCL: తాళ్లపేట అటవీ రేంజ్లో చిరుత పులిని చంపిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసామని ఎఫ్డీఓ రామ్మోహన్ తెలిపారు. దండేపల్లి మండలంలోని ఊట్లకు చెందిన మొడ్తే వెంకటేష్, మొడ్తే శ్రీనివాస్ పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ ఊట్ల అటవీ ప్రాంతంలో క్లచ్ వైరుతో ఉచ్చును వేసి చిరుత పులిని చంపి గోళ్లను సేకరించి కాల్చి వేశారన్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశామని FDO వెల్లడించారు.