PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా మంథని పోలీసులు పిల్లల భద్రత, “మత్తు పదార్థాల వినియోగం–అనర్థాలు” సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. స్థానిక నృసింహ గార్డెన్లో మంథని పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి రామ్ రెడ్డి హాజరయ్యారు.