WGL: మహిళా సర్పంచ్ల భర్తలు పెత్తనం చేయకూడదని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మహిళా సర్పంచ్లు ప్రొటోకాల్ విస్మరించకుండా జాగ్రత్తగా ఉండాలని, జనరల్ బాడీ మీటింగ్లలో సమయం వృథా చేయకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, మహిళా సర్పంచ్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.