RR: ఎండకాలంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. షాద్నగర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోకూడదని, తాగునీరు, సాగునీటికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.