NLG: దళిత వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన నాయకుడు కాన్షీరామ్ అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని కాన్క్షిరామ్ 92వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ, సమానత్వం, గౌరవం కోసం పోరాడటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులు అని అన్నారు.