VKB: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిగి, 12వ వార్డు అయ్యప్ప కాలనీలో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కౌన్సిలర్ వారాల రవీంద్ర ఆధ్వర్యంలో మంచినీటి పైప్లైన్లకు మరమ్మతులు చేయించారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా వార్డు మొత్తం పర్యవేక్షిస్తూ లీకేజీలను అరికడుతున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.