హన్మకొండ నగరంలో టైలర్ స్ట్రీట్‌లోని శివం కిరాణా స్టోర్‌లో నిషేధిత గుట్కాలు నిల్వ చేశారని సమాచారం మేరకు గురువారం హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.4.70 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ,రాజ్‌పుత్ చేతన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.