జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ SC బాలుర హాస్టల్ ని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను, కిచెన్ గదిని పరిశీలించారు. హాస్టల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలని, అలాగే వంటకి సంబందించి తాజా కూరగాయలను మాత్రమే వాడాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.