ప్రకాశం: అర్థవీడు మండలంలోని యాచవరం గ్రామ శివార్లలో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.27,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాంచారయ్య తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.