కామారెడ్డి పట్టణంలోని వార్డుల్లో శానిటేషన్ లేబర్లు ఎక్కడ పని చేస్తున్నారని BJP కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నేడు కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను కమిషనర్ ముందు ప్రస్తావించగా కమిషనర్ నుంచి సమాధానం రాకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.