AP: బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. అందుకే ఉపాధిహామీ పథకంపై మాట్లాడటం లేదన్నారు. జగన్ మూడు రాజధానుల పేరిట ప్రజలను అయోమయానికి గురిచేశారన్నారు. వీబీ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుందన్నారు. 150 రోజులు పని కల్పించి.. రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచుతామన్నారు.