BDK: చర్ల మండలం లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలో ని జాంబవంతుడి గుట్టల పై వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఆలయ నిర్వహకులు గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజైన ఇవాళ కళ్యాణాన్ని గిరిజన పూజారులు గిరిజన ఆచార సంప్రదాయాలలో ఎల్లమ్మ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.