TG: వరంగల్ సమగ్ర అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ అధికారులతో సమీక్షించారు. వరంగల్‌ను HYD తరహాలో తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2లోగా MGM సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని, నగరాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.