అనంతపురం కలెక్టరేట్లోని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జిల్లా ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎం.రవి శంకర్ కర్ణాటకకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం తన బాధ్యతలను అడిషనల్ డీఐఓ టి.భారతికి అప్పగించారు. ఇక నుంచి ఆమె జిల్లా ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్ ఇన్చార్జ్గా విధులు నిర్వర్తించనున్నారని అధికారులు తెలిపారు.