AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలపై ఆయన కీలక సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పెండింగ్ పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.